0866-2804560

శ్రీ మల్లిఖార్జున స్వామి అవతరణ

అమ్మవారికి తగిన వరుడు ఎక్కడ లభ్యమగునో అని మధనపడుతూ అమ్మవారిని తెలుపమని వేడుకోగా ప్రస్తుతము గుడిముందున్న రెండు జమ్మిచెట్లకు దక్షిణ భాగములో ఉన్న జమ్మిచెట్టు కింద ఉన్న బావిలో వేంచేసి యున్నారని చెప్పగా అలాగే తవ్విచూడగా, ఒక చిన్న లింగము కనిపించినది. ఆ లింగము బావిలో నుండి వెలికి తీసినపుడు భిన్నమగుటచే, ప్రక్కన ఉన్న గూటిలో భద్రపరిచి, యథావిధిగా నిత్యపూజలు జరుపుతూ, ప్రస్తుతము కన్పించుచున్న లింగమును తీసుకువచ్చి ప్రతిష్ఠించినారు.

ఇప్పుడు స్థలపురాణమున్న ప్రదేశములో ఆ బావి 1995 సంవత్సరము వరకు ఉండెడిది. ఆ బావి ఎండిపోయి నిరుపయోగమై, పాడుబడి నిరాదరణకు గురి అవటముతో పాపము చుట్టుకొనునని భావించి దానిని యథాతథంగాపూడ్చి, ఆ బావి పవిత్రతను, ప్రాముఖ్యతను కాపాడుటకు ఈ స్థలపురాణ ప్రదేశముగా తీర్చిదిద్దటమైనది. ఆ చిన్న లింగము ఇప్పుడు, ఈ శివాలయ అంతరాలయములో ఒకే గూటిలో ఉన్నది.

15