0866-2804560

శ్రీ భ్రమరాంబదేవి లీలలు

భ్రమరాంబదేవి శివలెంకవారి ఇలవేలుపు అవుట వలన అమ్మవారు, వీరభద్రయ్యవారి కాలములో అనగా క్రీ.శ. సుమారు 1750-1800 సంవత్సరాల మధ్య వారిని వెన్నంటిఉండెడిది. ఒకరోజు వీరభద్రయ్యగారు శివపూజ చేసుకుంటున్న సమయమున ఒక గాజుల వర్తకుడురాగా, వారి భార్య తనకు, తన కుటుంబసభ్యులకు గాజులు వేయించుకొని నలుగురికే డబ్బు ఇవ్వగా, ఆ వర్తకుడు నేను ఐదుగురుకు గాజులు వేసినానని వాదించెను.

అప్పుడు ఆయన విని మన భ్రమరాంబ వేయించుకున్నదేమో అని చెప్పి పైకము ఇచ్చి పంపినారు. సాయంత్రము ఆయన ఆలయమునకు వెళ్ళినప్పుడు, నేను ఉదయము మీ ఇంటిలో గాజులు వేయించుకున్నాను, ఆ విషయము నీ భార్యకు తెలియక గొడవపడినదని చెప్పి, చేతికి గాజులు చూపినది. అమ్మవారి లీలలు విని అందరూ ఆనందించినారు.

ఈ లీలలు చూసి అమ్మవారు గ్రామములో సంచరించుచున్నదని తెలిసి చాలామంది భయభ్రాంతులకు లోనైనారు. అప్పుడు అయ్యవారు అమ్మవారి కలలను ఉపసంహరింపచేసి ఆలయములోనే ఉండునట్లు చేసిరి.

08