0866-2804560

శ్రీ భ్రమరాంబదేవి అవతరణ

స్వామి స్వప్నములో చెప్పినట్లు ఐదు జమ్మిచెట్ల వద్ద ఉన్న బావి దగ్గర, త్రవ్వినప్పుడు స్వయముగా వెలిసినట్లుగా ఉన్న అమ్మవారు లీలామాత్రముగా కనిపించుతూ ఉన్న శిలా విగ్రహము కనుపించినది. కాని రూపురేఖలు లేని కారణముగా అమ్మవారి రూపము చెక్కించవలనని తలెపెట్టిరి. అమ్మవారితో మొరబెట్టుకోగా ఆ బాధ్యత తనకు వదలిపెట్టమని, త్వరలో ఆ కార్యము సిద్ధించునని చెప్పినది.

ఆ మరునాడు ఒక శిల్పి అక్కడికి రావటము అయింది. ఆకార, రూపురేఖ లావణ్యములు, చూపించిన చెక్కగలనని చెప్పెను. అంతట ఆ శిల్పికి బాలమంత్రోపాసన చేసి, 21 రోజులు దీక్షగా జపించిన తరువాత పని మొదలు పెట్టమనిరి. ఆ అమ్మవారు ఏ రోజుకారోజు శిల్పి చెక్కవలసిన భాగము వరకు సాక్షాత్కరించి, విగ్రహము ప్రస్తుత రూపములో చేయించుకొనిరి.

14