0866-2804560

జీవనందీశ్వర చరిత్ర

కొన్ని రోజుల తరువాత, తిరిగి ఆ గ్రామములోని శిష్యులు,ఒక ఎద్దు రోజూ రాత్రి పంటను తినివేయుచున్నదని,పగలు ఎక్కడ కనపడుటములేదని అయ్యవారికి విన్నవించుకున్నారు.

ఆ రోజు అర్థరాత్రి అయ్యవారు గుడికి వచ్చి చూడగా నందీశ్వరుడు లేకపోవుట గ్రహించి మర్నాడు అచ్చట ఉన్న బావిలో ఊయల స్తంభన సంకల్పము చేసి, 21(ఇరువది ఒక్కటి)రోజులు, కఠోరదీక్షతో, ఆహారపానీయములకు బదులు, రోజూ మూడు మిరియముగింజలను నోటిలో పెట్టుకుని, ఒక స్థంభన యంత్రమును మంత్రించి, ఆ మంత్రమును ఒక కడియమందు శీలాసంతాన లేకుండా అతికించి, మంత్రోచ్చారణ గావించి, బసవా కాలుపైకెత్తమనగా, నందీశ్వరుడు తన ముందుకాలును పైకెత్తగా, కడియము తొడిగి కాలు దింపుమనగా కాలు దింపినది.

అట్లు నందీశ్వరుడు గుడినుండి బయటకు పోకుండా చేసిరి. ఇప్పటికి ఆ నందీశ్వరునకు వేసిన కడియమును చూడవచ్చు. అందుచే ఇచ్చట నందీశ్వరుడుని జీవనందీశ్వరునిగా ఆరాధిస్తారు.

బసవన్నయ్య అయ్యవారి కుమారుడు బసవయ్య అయ్యవారి కాలములో శివాలయము కట్టించినారు.

బసవయ్య అయ్యవారి కుమారుడు వీరేశలింగం అయ్యవారి కాలములో ముఖమంటపము, అమ్మవారి ఆలయము కట్టించినారు.

వీరేశలింగం అయ్యవారి కుమారులు వీరభద్రయ్య అయ్యవారి కాలములో వీరభద్రాలయము, ముఖగోపురము కట్టించినారు. 1850 సంవత్సర ప్రాంతములో శ్రీ బసవయ్య అయ్యవారు ఈనాము భూములు ఏర్పాటు చేసినారు.

17